
సంగారెడ్డి,వెలుగు : పోలీసులు అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ పరితోశ్పంకజ్ సూచించారు. శుక్రవారం ఆయన హోలీ సందర్భంగా పలు సెంటర్లను సందర్శించారు. అనంతరం మాట్లాడుతూ.. పండుగ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూడాలని సిబ్బందిని ఆదేశించారు. ప్రమాదాలు జరగకుండా డ్రంకన్ డ్రైవ్ నిర్వహించాలని సూచించారు. యువత మద్యం తాగి ర్యాష్ డ్రైవింగ్చేయవద్దన్నారు. గంజాయి, మత్త పదార్థాలకు దూరంగా ఉండాలన్నారు. ఆయన వెంట పోలీస్సిబ్బంది ఉన్నారు.